చర్మవ్యాధులను నయం చేసే వేడి నీటి గుండాలు

ప్రపంచంలోనే భారత దేశానికి ఆధ్యాత్మిక దేశంగా… పేరుంది. ప్రసిద్ధ దేవాలయాలు.. పుణ్యక్షేత్రాలు.. జీవన విధానం, కర్మ సిద్ధాంతం ఇలా అనేక కారణాలతో భారత దేశానికి ధార్మిక దేశమని పేరువచ్చింది. ఇక మన దేశంలో ఎక్కువుగా దేవాలయాలకు ముందు భాగంలో తీర్దాలు, నీటి గుండాలు ఉంటాయి. అవి కొన్ని మానవ నిర్మితాలు కాగా… మరికొన్ని సహజ సిద్ధంగా ఏర్పడినవి.. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ తీర్ధలల్లో స్నానమాచరించి పవిత్రంగా దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు ఇష్టపడతారు. అంతేకాదు.. ఇలా దేవాలయం వద్ద ఉన్న తీర్దాలు, లేదా నీటి గుండాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే ఎక్కువుగా తీర్దాల్లో నీరు చల్లగా ఉంటుంది.. కానీ ఆశ్చర్యం కలిగే విధంగా కొన్ని పుణ్యక్షేత్రాలలోని తీర్దాల్లో నీరు వేడిగా ఉండడమే కాదు.. వాటిలో స్నానం చేయడం వల్ల కొంతమందికి చర్మవ్యాధులు కూడా నయం అవుతున్నాయి. అయితే ఇలా జరగడానికి కారణం మాత్రం ఇప్పటికీ రహస్యమే.. అటువంటి రహస్యాలను తనలో దాచుకున్న వేడి నీటి గుండాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం…
దేవతలకు నిలయంగా పేరుపొందిన హిమాచల్ ప్రదేశ్ లోని ‘మణికరన్’ పార్వతీ లోయ లో ఉంటుంది. ఈ మణికరన్ హిందువులతో పాటు.. సిక్కులకు కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న నీటిలో స్నానం చేస్తే… దీర్ధకాలంగా బాధపడుతున్న చర్మ రోగాలతో పాటు.. ఆస్మా కూడా చాలా వరకూ నయం అవుతుంది.. అందుకనే ఈ క్షేత్రానికి నిత్యం హిందూ, సిక్కులు భక్తులు వేల సంఖ్యలో వస్తారు.

పశ్చిమ బెంగాల్ లోని బకరేశ్వర్ లో ఉన్న కుండను అగ్ని కుండ్ అని అంటారు. ఈ కుండ్ లోని నీరు 80 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకూ వేడిగా ఉంటుంది. ఇందులో ఉన్న సోడియం, పొటాషియం, కాల్షియం, సిలికేట్, క్లోరైడ్, బై కార్బోనేట్ సల్ఫేట్ ల వల్ల ఈ కుండంలోని నీరు ఔషద గుణాలను కలిగి ఉందని… అందుకనే ఈ అగ్ని కుండ్ లో స్నానం చేస్తే.. చర్మ వ్యాధులు తగ్గుతాయని చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత యుద్ధ క్షేత్రం గా పేరున్నది జమ్ముకాశ్మీర్ లోని సియాచిన్ ప్రాంతం.. ఈ సియాచిన్ కు సమీపంలో రుబ్రవ్యాలీ అనే ప్రాంతంలో పనామిక్ ఉంది. ఇక్కడ ఉన్న వేడినీటి సరస్సులో సల్పర్ అధికంగా ఉండడం వల్ల ఔషధగుణాలు ఉన్నట్లు స్థానికులు కథనం. దీంతో రుబ్రా వ్యాలీ గ్రామీణ ప్రజలతో పాటు.. చుట్టుపక్క ప్రాంత ప్రజలు కూడా ఈ వేడినీటి బుగ్గ వద్దకు తరచుగా వెళ్తుంటారు.

బీహార్ రాష్ట్రంలో నలందా జిల్లాలో ఉన్న రాజ్ ఘిర్ అనే చిన్న పట్టణంలో వేడి నీటి గుండం ఉంది. ఈ వేడినీటి గుండంలో స్నానం చేయడానికి స్థానికులే కాదు.. దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈ నీటిలో స్నానం చేస్తే… అనేక చర్మవ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి శీతాకాలంలో అత్యధిక సంఖ్యలో పర్యకులు వస్తారు.

తపత్ కుండ్.. ఉత్తరా ఖండ్ లోని బద్రినాథ్ లో ఉంది. మహావిష్ణు ఆదేశాలను అనుసరించిన అగ్నిదేవుడు ఇక్కడ ఉన్న తపత్ కుండ్ లో నిత్యం నివసిస్తూ ఉంటాడని పురాణాల కథనం.. .. అందువల్ల ఈ గుండం లో ఎవరైతే స్నానం చేస్తారో.. వారి పాపాలన్నీ హరించి పోతాయని భక్తుల నమ్మకం.. బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు ముందుగా తపత్ కుండ్ లో తప్పక స్నానం ఆచరిస్తారు. ఎముకలు కోరికే చలిలో కూడా ఈ తీర్ధల్లో స్నానం చేయడానికి భక్తులు రెడీ అవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here