ఫైళ్ల క్లియరెన్స్ లో ఎన్నికోట్లు చేతులు మారతాయో: కోదండరామ్

మధ్యంతర ఎన్నికల అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జగిత్యాల లో విలేకరులతో మాట్లాడుతూ, హడావిడిగా ఫైళ్లు ఎందుకు క్లియర్ చేస్తున్నారు?… ఈ ఫైళ్ల క్లియరెన్స్ లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయో?.., అని అన్నారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోదండరామ్ కోరారు. ఇన్నాళ్లూ సచివాలయం మొహం చూడకుండా, ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారని ఆరోపించారు. నేల మాళిగల్లో దాగిన ఫైళ్లపై ఇప్పుడెందుకు సంతకాలు పెడుతున్నారని? టీజేఎస్ అధినేత కోదండరామ్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here