నేడు కేరళకు రాహుల్ గాంధీ

వరదలతో అతలాకుతలమైన కేరళను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కేరళలో ఉండి సహాయక శిబిరాలను సందర్శించనున్నారు. జాలర్లు, స్వచ్ఛంద సేవకులను ఈ పర్యటనలో కలుస్తానని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈరోజు ఉదయం డిల్లీ నుండి కేరళ రాజధాని తిరువనంతపురంకు రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడ నుంచి చెంగనూర్, అలప్పూజ, అంగమాళి లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కొచ్చి చేరుకుని అలువా,పరావూర్, చాలక్కూడీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. రేపు వయనాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కోజికోడ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here