ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, కేసీఆర్ ఢిల్లీ పర్యటన వంటి సందర్భాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే హైదరాబాద్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొరనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ తన ఆలోచనలను బీజేపీ ఎమ్మెల్యేలతో పంచుకునే అవకాశముంది. అయితే గత కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరలేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here