150సినిమాలను వరస క్రమంలో ఆగకుండా చెప్పిన హాసినిని సన్మానించిన చిరు, చరణ్ లు

అసాధారణ జ్ఞాపక శక్తితో అబ్బురపరచి “ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్”లో స్థానం సంపాదించిన చిన్నారి హాసిని. విజయవాడ నగరానికి చెందిన మున్నంగి ఉమాశంకర్, జ్యోతి దంపతుల రెండవ సంతానమైన చిన్నారి మున్నంగి హాసిని స్థానిక ‘ఐకాన్’ పబ్లిక్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్నది. హాసిని చూసిన మరియు చెప్పిన విషయాలను జ్ఞాపకముంచుకుని వాటిని తిరిగి చెప్పాలనే తపనను గమనించిన తల్లి దండ్రులు హాసినిని ప్రోత్సహించారు. దీంతో హాసిని ప్రపంచ దేశాలు, రాజధానులతోపాటు భారతదేశ రాష్ట్రపతులు, ప్రధానులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, గవర్నర్ల పేర్లు వరుస క్రమంలో చెప్పడంతో పాటు ప్రస్తుత భారతదేశం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు మరియు దేశ రాష్ట్ర మంత్రివర్గాన్ని తడుముకోకుండా చెప్పి, సాధారణ జ్ఞాపక శక్తిలో మెరుగైన పరిణితి పొందింది. ఇటీవల శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకలలో ‘హాసిని’ చూడకుండా శ్రీ చిరంజీవి గారి 150 చిత్రాల పేర్లు వరుస క్రమంలో తక్కువ సమయంలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ‘హాసిని’ ని చిన్నారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని ‘చిరు సత్కారం’ చేశారు. రామ్ చరణ్ కూడా చిన్నారితో సంతోషంగా కొద్ది సేపు గడిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here