ఎమ్మెల్యే రామానాయుడు నన్ను బెదిరించారు: కాంట్రాక్టర్ పృథ్విరాజ్

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు సిఐ కృష్ణకుమార్ పై కూడా పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. నీటిపారుదల పనులలో 20శాతం కమీషన్ ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరిస్తున్నాడని, అలాగే తనపై తప్పుడు కేసు కూడా పెట్టించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వత్తిడి మేరకు సిఐ కృష్ణకుమార్ పాలకొల్లు పోలీస్ స్టేషన్ కు తనను పిలిపించి తీవ్రంగా బెదిరించారని పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పృథ్విరాజ్ ఎస్పీని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here