విరసం నేత వరవరరావు ఇంట్లో పోలీసుల తనిఖీలు

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ఉదయం తనిఖీలు చేశారు. నరేంద్రమోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు ఇటీవల కేసు నమోదైంది. ఈ కుట్ర కేసులో వరవరరావు పెరు కూడా ఉంది. దీంతో హైదరాబాద్ లో గాంధీ నగర్ లోని వరవరరావు ఇంటితో సహా నగరంలోని మరో నాలుగు చోట్ల మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అలాగే వరవరరావు చిన్నకూతురు, బిజినెస్ లైన్ రిపోర్టర్ కూర్మనాధ్ ఇళ్లలో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్య చేసేందుకు జరిగిన కుట్రలో వరవరరావు పాత్ర ఉందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో భాగంగా ఈ ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here