సంతోషం సురేష్ నన్ను మోసం చేసాడు: చిరంజీవి

16వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథమహారధులతో పాటు చిరంజీవి కూడా వచ్చారు. చిరంజీవి కి అవార్డ్ ప్రకటించారు. ఈ అవార్డును గాన కోకిల జానకి చేతులమీదుగా ఇప్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ నన్ను మోసం చేశాడని అన్నారు. సురేష్ ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు తనకు అవార్డు ఇస్తానంటే ఈ వేడుకకు రానని, ఇవ్వనంటేనే వస్తానని సురేష్ కు ముందే చెప్పానని, అయితే నన్ను మోసం చేసి, నాకు ఎంతో ఇష్టమైన జానకమ్మ చేతులమీదుగా అవార్డ్ ఇప్పించి, నన్ను కట్టిపడేసాడని అందుకే కాదనలేకపోయానని చిరంజీవి అన్నారు. తొలిసారిగా జానకమ్మ చేతులమీదుగా అవార్డ్ తీసుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఇదే మరొకరి చేతులమీదుగా అవార్డ్ ఇప్పించి ఉంటే సున్నితంగా తిరస్కరించేవాడినని చిరంజీవి అన్నారు. ఇక గానకోకిల జానకి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఈ ఫంక్షన్ కు రావాలని సురేష్ అడుగుతుంటే రాలేకపోయానని చెప్పిన జానకి, చిరంజీవి సినిమాల్లోని హిట్ సాంగ్స్ అన్నీ తనవేనని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నంబర్150 ఇటీవలే చూశానని, అందులో పాత చిరంజీవిని చూసినట్లే ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here