అన్న అళగిరిపై స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు

డీఎంకే అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ.., తాను ఇదివరకటి స్టాలిన్ ను కాదని.., సరికొత్త స్టాలిన్ అని పేర్కొన్నారు. తనకు సోదరి మాత్రమే ఉందని, సోదరుడు లేడని అన్నారు. పరోక్షంగా, తన అన్న అళగిరితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి పదవుల కుమ్ములాటలే కానీ ప్రజల గురించి పట్టదన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, దేశ ప్రజలను మతాల పేరుతో విడగొడుతోందని విమర్శించారు. దేశంలో జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే తక్షణం ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీని దించేయాలని స్టాలిన్ పేర్కొన్నారు. అలాగే బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here