ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే: సంధ్య

అనునిత్యం మనముందు కనపడే విరసం నేత వరవరరావు ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనడం మహా దారుణమని మహిళా నేత పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రేనని సంధ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలను గతంలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంఘాలన్నీ ఖండించాయని గుర్తు చేశారు. మోదీ హత్యకు కావాల్సిన ఫండింగ్ ను వరవరరావు చేస్తున్నారనే ఆరోపణలు చాలా దారుణమని సంధ్య అన్నారు. వరవరరావును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రజా సంఘాల నేతలంతా ఒక్కొక్కరుగా వరవరరావు ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన ఇంటివద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here