అన్నయ్య నాన్నగారిలా హుందాగా ఉండేవారు: బాలకృష్ణ

అన్నయ్య హరికృష్ణ నాన్నగారిలా హుందాగా ఉండేవారని ఆయన సోదరుడు హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హరికృష్ణ నివాసం వద్ద బాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ.., హరికృష్ణ అన్నయ్య అందరితో మంచిగా, కలుపుగోలుగా ఉండేవారని అన్నారు. అన్నయ్య తాతగారి వద్ద మా సొంతవూరు నిమ్మకూరు లో పెరిగారన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోయేవారన్నారు. అన్నయ్య మరణం మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి, అభిమానులకి, టీడీపీ కార్యకర్తలకు తీరని లోటన్నారు. అన్నయ్య సంస్కృతి, సంప్రదాయం, బంధుత్వానికి ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఆయన లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ది కావడంలేదని బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here