హరికృష్ణ మరణం దురదృష్టకరం: చిరంజీవి

నందమూరి హరికృష్ణ మరణం దురదృష్టకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ కలసి హరికృష్ణ ఇంటికి చేరుకుని, ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సోదరసమానుడైన హరికృష్ణ ఆకాలమరణం చాలా బాధగా ఉంది. ఎప్పుడు కలిసినా హరికృష్ణ ఆప్యాయంగా పలకరించేవారు, నవ్విస్తూ ఉండేవారు. నలుగురిలో కలసిపోయేవారు. ఇప్పుడేమో అందరినీ శోకంలో ముంచి వెళ్లిపోయారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here