సీతయ్య మృతితో.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

నటుడు హరికృష్ణ రోడ్డు ప్రమదంలో మరణించాడు… నటన, ఆహార్యంలో తండ్రి ఎన్టీఆర్ ను తలపించే నటుడు హరికృష్ణ… బాలనటుడు గా ప్రవేశించిన హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలు అయినా సీతయ్య పాత్రతో తనదైన ముద్ర వేసుకున్నారు. 2005 లో వచ్చిన శ్రావణమాసం సినిమా తరువాత హరికృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కొడుకులు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు . వారి సినిమాలు చూస్తూ వారండుకుంటున్న హిట్స్ కి సంతోషంగా ఉన్న హరికృష్ణ సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హరికృష్ణ రోడ్ ప్రమాదం లో తిరిగి రాని లోకాలకు చేరినా ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీతయ్యను సినీ పరిశ్రమలోని ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మోహ‌న్ బాబు, మంచు లక్ష్మీ, మ‌నోజ్, కోన వెంక‌ట్‌, అల్లు శిరీష్‌, త‌మ్మారెడ్డి, దేవి శ్రీ ప్రసాద్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, హ‌రీష్ శంక‌ర్, శ్రీకాంత్, అల్లరి నరేష్, బ్రహ్మాజీ, అనిల్ రావిపూడి, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, గౌతమి, గోపీచంద్ మలినేని, నివేదా థామస్ త‌దిత‌రులు హ‌రికృష్ణ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here