మీడియాకు మంచు మనోజ్ విజ్ఞప్తి

హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను పదే పదే ప్రసారం చేయవద్దని మంచు మనోజ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. తన ట్విట్టర్ వేదికగా మనోజ్ స్పందిస్తూ.. ” ఊహించని విధంగా ఈ ప్రమాదంలో తమ ఆత్మీయుడిని కోల్పోయిన అనుచరులు, కుటుంబ సభ్యులకు మీడియాలో వచ్చే దృశ్యాలు మరింత బాధను కలుగజేస్తాయి. ఆయన మనందరి మనిషి. దయచేసి ఆయన్ని గౌరవిద్దాం. ఇది నా విజ్ఞప్తి.. దీనిని మీడియా పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా. ధన్యవాదాలు” అని మనోజ్ ట్వీట్‌లో తెలిపాడు. ఇప్పటికే ఆయన బౌతిక కాయం మెహదీ పట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది. రేపు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here