రాజ్య సభలో తెలుగు భాషా ప్రాధాన్యం కోరిన ఒక్క మగాడు

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఎన్టీఆర్ కు రాజకీయ వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు.. మంత్రిగా, రాజ్య సభ సభ్యుడిగా పని చేసిన హరికృష్ణ తనకు మంచిది అనిపిస్తే.. ఎవరి మాటా వినేవారు కాదని.. అధికారులను కూడా లెక్క చేయకుండా తాను అనుకున్న పని చేసేవారని సన్నిహితులు చెబుతారు. ఇక తండ్రిలా తెలుగు భాషనూ అమితంగా ఇష్టపడే ఆయన తెలుగు రాష్ట్రం విభజన తర్వాత కాంగ్రెస్ తీరుని నిరసిస్తూ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హరికృష్ణ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు హరి కృష్ణ తీవ్రంగా నిరసించారు.
స్వయానా అన్న ఎన్టీఆర్ గారి చేత ఆ కష్ట సమయంలో నా కొడుకు హరికృష్ణ నే నా పార్టీ కి వారసుడు అనిపించుకున్న ఒక్క మగాడు . మొన్ననే చేతికి అందివచ్చిన కొడుకు ని కూడా ఇలాంటి ప్రమాదం లోనే పోగొట్టుకుని కూడా గుండె నిబ్బరం తో ఉన్న హరికృష్ణ మరణంతో తీవ్ర విషాదం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here