హరికృష్ణ అంతిమ యాత్రకు రెడీ అవుతున్న చైతన్య రథం… !

చిన్నతనంలోనే తండ్రిని ముందుండి నడిపించిన హరికృష్ణ… తెలుగు వారి ఆత్మాభిమానం కోసం తెలుగు దేశం పార్టీ ని స్థాపించిన తన తండ్రి ఎన్టీఆర్ నిర్వహించిన చైతన్య రథ యాత్రలో అత్యంత కీలక పాత్రను పోషించారు. సుమారు 72 వేల కిలోమీటర్లు సాగిన యాత్రకు హరికృష్ణ సారథిగా వ్యవహరించారు. తండ్రి వెన్నంటి ఉండి… తండ్రిని అసెంబ్లీ కి పంపించారు. దీంతో హరికృష్ణకు చైతన్య రథయాత్రకు మధ్య ప్రత్యెక అనుబంధం ఉంది. ఈ వాహనం ప్రస్తుతం రామకృష్ణ స్టూడియోలో ఉన్నది. హరికృష్ణ అంతిమ యాత్రకు ఆయనకు ఇష్టమైన ఈ వాహనాన్నే ఉపయోగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పడు తండ్రి కోసం ప్రత్యేకంగా సిద్దమైన ఈ చైతన్య రధం… సారథి అంతిమ యాత్రకు రెడీ అవుతుంది.. ఇక కుమారులు ఇద్దరూ తండ్రి ప్రార్దీవ దేహం వద్ద విలపిస్తున్న దృశ్యం అందరినీ కంట తడిపెట్టిస్తుంది.. కుమార్తె సుహాసిని కాకినాడ నుంచి మెహదిపట్నం చేరుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here