చైతన్య రధ సారధి ఇక లేరు ….

నందమూరి కుటుంబంలో పెను విషాదం. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కాసేపటికి స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here