సీతయ్య ఎవరి మాటా వినడు… అంటోన్న సన్నిహితులు..

నందమూరి హరిక్రష్ణ. నటుడిగా… రాజకీయ నాయకుడిగా…. వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ కూడా ఎవరి మాట వినరనే పేరు ఉంది. ఇది చాలా వరకూ నిజమేనంటున్నారు ఆయన సన్నిహితులు. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం సమయంలో ఎంతో అండగా నిలిచారు. నిజానికి హరికృష్ణనే దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలను ఎన్.టి.రామారావు తీసుకుంటే వాటిని అమలు పరిచే బాధ్యత హరిక్రష్ణే తీసుకునే వారని సన్నిహితులు టాక్.. ఈయనకు చెప్పకుండా ముఖ్యమంత్రి హోదాలో ఎన్.టి.రామారావు ఏ పని చేసే వారు కాదని తెలుగు దేశం పార్టీ నాయకులు అంటారు. అయితే తన తండ్రి మహానటుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండో పెళ్లి విషయంలో ధిక్కరించిన నైజం హరిక్రష్ణ సొంతం. హరికృష్ణ రాజకీయ ప్రస్థానం ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ.. 1996లో రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించారు. ఆపై 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక ఆయిన హరికృష్ణ ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here