కన్నీరు పెట్టిస్తోన్న హరికృష్ణ చివరి లేఖ

స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే మరో నాలుగు రోజుల్లో ఆయన పుట్టిన రోజు జరుపుకోనుండగా హటాత్తుగా మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను ఇటు అభిమానులను షాక్ కు గురి చేసింది. సెప్టెంబర్ 2 న హరికృష్ణ జన్మదినాన్ని పురష్కరించుకుని తన అభిమానులను ఉద్దేశించి ఆయన రాసిన లేక ఇప్పుడు బయటకు వచ్చింది. తన పుట్టినరోజు జగనున్న నేపథ్యంలో అభిమానులకు ఓ సందేశాన్ని ఇస్తూ.. ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణం తర్వాత బయటకు వచ్చింది..
తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2 న ఎటువంటి వేడుకలను నిర్వహించవద్దని… మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలో, కేరళలో వర్షాలు వరదలు కారణంగా ఎంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. వేలాది మంది తిండి బట్ట లేక.. ఉండడానికి ఇల్లు లేక నిరాశ్రయులయ్యారు. ఇది అందరికీ అంతో బాధనుకలిగించే విషయం.. కనుక నా పుట్టిన రోజుకు బ్యానర్స్, ఫ్లెక్సీ వంటివి ఏర్పాటు చేయవద్దని… నాకు శుభాకాంక్షలు చెప్పడానికి పుష్ప గుచ్చాలు, దండలు వద్దని.. వాటి కోసం మీరు పెట్టె ఖర్చు… వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలను అందజేయాలని ఆ లేఖలో హరికృష్ణ కోరుకున్నారు. అంతేకాదు.. నిరాశ్రయులైన వారికి వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయమని కోరుతున్నా … మీ నందమూరి హరికృష్ణ అని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ ఉత్తరం వెలుగులోకి వచ్చాక అభిమానులు కన్నీరు పెడుతున్నారు. నాలుగురోజుల్లో నవ్వుతు పుట్టిన రోజు జరుపుకోవాల్సిన వ్యక్తి…. సడన్ గా నిర్జీవంగా కనిపించడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు.