తాతగారికి ఇష్టమైన మనవడు హరికృష్ణ.. ఆయనలా ప్రమాదంలోనే మృతి

తండ్రి ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులోనే హరికృష్ణ జన్మించారు. ఆయన బాల్యం, ప్రాధమిక విద్యాభాస్యం కూడా అదే ఊరులో జరిగింది. చివరకు నిమ్మకూరుకు చెందిన లక్ష్మిని హరికృష్ణ వివాహం చేసుకున్నారు. అంతగా ఆయనకు నిమ్మకురుతో అనుబంధం ఉంది. ఇక హరికృష్ణకు తాత గారు అంటే అమితమైన ప్రేమ.. తండ్రి పేరున్న నటుడు… నగరమైనా సరే చెన్నై వెళ్ళడానికి ఇష్టపడే వారు కాదు. అయితే రామకృష్ణ స్టూడియో నిర్మాణం కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో తాను పడిన కష్టాన్ని హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రామకృష్ణా స్టూడియో కట్టిన సమయంలో తనతో పాటు తాతగారు కూడా హైదరాబాద్ లో ఉండడానికి అంగీకరించారు. అందుకనే నేను హైదరాబాద్ వచ్చాను. ఒకసారి మాతాతగారు శంషాబాద్ పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో రాజేంద్ర నగర్ దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించారు. అప్పుడు మా నన్నాగారు నా తండ్రిని మింగిన పొలం నాకు వద్దు అని దానిని అమ్మేశారు. అని హరికృష్ణ తనకు తన తాతగారితో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఐతే యాదృశ్చికమో లేక విదిలిఖితమో.. తాతగారికి అత్యంత ఇష్టమైన మనవడు హరికృష్ణ కూడా తన తాతగారిలా ప్రమాదంలో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here