తండ్రి తనయుడు.. మరణంలోనూ వీడని కారు నెంబర్లు

నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ లో వరసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లాలోనే ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాదు… హరికృష్ణ తనయుడు జానకి రామ్, హరికృష్ణ మరణానికి కూడా సామీప్యం ఉండడం ప్రస్తుతం అందరినీ కలచి వేస్తుంది. అయితే ఈ తండ్రి కొడుకుల మరణంలో సామీప్యత యాదృశ్చికమో… లేక సెంటిమెంటో తెలియదు కానీ.. హరికృష్ణ , జానకిరాం లు వాడిన రెండు కారు నెంబర్లు ఒకటే . వాహనాలు వేరు అయినా వారిద్దరి కారు నెంబర్లలో 2323 తోనే ఉండడం అందరినీ నివ్వెర పరిస్తున్నాయి
. నాలుగేళ్ళ జానకి రాం ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 29BD 2323. ఇప్పుడు హరికృష్ణ ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 28 BW 2323… ఒకటే కావడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది విధి లిఖితం అంటూ అభి మానులు బంధుగణం కన్నీరు పెడుతున్నారు.. ఇక అంత్యక్రియలు కూడా కుమారుడు జానకిరామ్ కు నిర్వహించిన ప్లేస్ లోనే హరికృష్ణకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here