హరికృష్ణ మృతికి కారణాలు వెల్లడించిన ఎస్పీ రంగనాధ్

సినీనటుడు హరికృష్ణ ప్రమాదానికి గల కారణాలను నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ వెల్లడించారు. అతివేగమే హరికృష్ణ మృతికి కారణమని ఎస్పీ స్పష్టం చేశారు. సీటు బెల్టు పెట్టుకునివుంటే ప్రమాద తీవ్రత తగ్గేదని, ఆయన వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో కారు అదుపు తప్పిందని వెల్లడించారు. కారు డివైడర్ ను ఢీకొని 15 మీటర్ల దూరంలో ఎగిరిపడిందని చెప్పారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని చెప్పారు. ప్రమాద సమయంలో కారు 160 కి.మీ వేగంతో వెళ్తోందని ఎస్పీ రంగానాధ్ వివరించారు.
హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. కారులో నుంచి ఎగిరి బయటకు పడిపోయిన హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. హరికృష్ణ ను స్థానికులు కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యం మొదలుపెట్టేసరికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
52

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here