అనకాపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తా: జగన్మోహన్ రెడ్డి

వైసీపీ అధికారంలోకి రాగానే అనకాపల్లి కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని విపక్ష నాయకుడు,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముందు మాజీ ఎంపీ హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు.తర్వాత మాట్లాడుతూ అనకాపల్లి అంటే బెల్లానికి ప్రముఖ కేంద్రమని, కానీ బెల్లం తయారు చేసేవారి జీవితాలు మాత్రం బాగుపడటంలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ బెల్లం ధర 84 రూపాయలు అని, కానీ రైతులు తయారుచేసిన క్వింటాల్ బెల్లానికి 2500-3000 రూ. కూడా పలకడంలేదని ఆరోపించారు. మార్కెట్ బెల్లానికి, హెరిటేజ్ బెల్లానికి చాలా తేడా ఉందన్నారు. ముఖ్యమంత్రే దళారీగా మారితే, మరి రైతులను ఆదుకునేదేవరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చెరుకు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు మూసివేయిస్తున్నారు. ఆయన బంధువు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి చక్కెర ఫ్యాక్టరీ కట్టబెట్టాలని చూశారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here