బిగ్ బాస్ హౌస్ నుంచి ఈసారి ఇద్దరు ఎలిమినేషన్ కానున్నారా..!

బిగ్ బాస్ సీజన్ 2 కు ఇక మూడు వారాలే మిగిలి ఉంది. చివరి దశకు చేరుకున్నా బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎక్కువ మంది సభ్యులున్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్ లో ఇద్దరు ఉండనున్నారు అని తెలుస్తోంది. అసలు గత వారంలోనే డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు వినిపించినా షో నిర్వాహకులు… రాఖీ సెలబ్రేషన్స్ అంటూ… హోస్ట్ నాని… బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చి సందడి చేసి.. పూజ తో పాటు.. తను కూడా హౌస్ నుంచి ఏమిలినేట్ అని చెప్పి వచ్చేశాడు… దీంతో డబుల్ ఎలిమినేషన్స్ ఈ వారం కు వాయిదా పడ్డాయి. ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో కౌశల్, సామ్రాట్, నూతన్ నాయుడు, గణేష్, అమిత్ ఈ ఐదుగురు ఉన్నారు.

ఐతే ఐదుగురులో కౌశల్ కు కౌశల్ ఆర్మీ అండగా ఉంది.. మొత్తం ఓట్లలో సగానికి పైగా కౌశల్ కు పడతానేది… షో నిర్వాహకుల తో పాటు బుల్లి తెర ప్రేక్షకుల నమ్మకం… దీంతో తనకు ఎలిమినేషన్ అనే సమస్య లేదు.. ఇక ప్రస్తుతం ఓట్ల వ్యవహారంలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే.. అత్యధికంగా కౌశల్ కు ఓట్లు పడుతుండగా… అత్యల్పంగా గణేష్ కు పడుతున్నల్టు తెలుస్తుంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సామాన్యుడుగా అడుగు పెట్టిన గణేష్ ఒకరు అని అంటున్నారు. ఇక గణేష్ ఎలిమినేషన్ దాదాపు ఖాయం కాగా.. గణేష్ తో పాటు.. అమిత్ కూడా బయటకు వచ్చె అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సేఫ్ గేమ్ ప్లాన్ తో ఆడుతూ…. కంటిన్యూ ఐన అమిత్ కు చాలా తక్కువ ఓట్లు పడుతున్నట్లు ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.
సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన గణేష్ అసలు ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం చాలా గొప్పని…. అసలు గణేష్ ఒకసారి స్వయంగా తాను ఇన్నాళ్ళు హౌస్ లో ఎలిమినేషన్ కాకుండా ఉన్నానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు… గణేష్ పై ప్రేక్షకులకు కూడా ఆదరణ తక్కువుగా ఉంది.. దీంతో ఈ సారి గణేష్ ఎలిమినేషన్ ఖాయం కాగా… ఇప్పటి వరకూ అతి తక్కువ సార్లు ఎలిమినేషన్ జోన్ లో అడుగు పెట్టి సేఫ్ గెమ్ ఆడుతున్న అమిత్ ఈ సారి సేవ్ అవ్వడం అంత సులభం కాదని…. ట్రెండ్ అవుతున్న ఓట్ల బట్టి తెలుస్తోంది. ఇక ఓట్లలో కౌశల్ మొదటి ప్లేస్ లో ఉండడం దాదాపు ఖాయం… ఇక సెకండ ప్లేస్ కోసం ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, సామ్రాట్ లు పోటీ పడుతున్నారు… అయితే ఈ ముగ్గురు సేఫ్ అయ్యి.. ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక సామాన్యుడు, ఒక సెలబ్రిటీ బయటకు రానున్నారు అని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here