బీజేపీ చీఫ్ కు కోల్ కతా కోర్టు సమన్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు కోల్ కతా కోర్ట్ సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ చీఫ్ పై పరువు నష్టం దావా దాఖలు చేసారు. ఆగస్ట్ 11వ తారీఖున కోల్ కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా, అభిషేక్ బెనర్జీపై అవినీతి ఆరోపణలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన అభిషేక్ బెనర్జీ ఆగస్ట్ 13న ఆయనను భేషరతు క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోల్ కతా కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్., సెప్టెంబర్ 28న కోర్టు ఎదుట అమిత్ షాను హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఆగస్ట్ 11న జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను మమతా బెనర్జీ ప్రభుత్వం అభిషేక్ బెనర్జీకు ఆర్థిక ప్రయోజనాలకోసం వినియోగించిందంటూ అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎంపీ అభిషేక్ బెనర్జీ.. భేషరతు క్షమాపణలు చెప్పాల్సింది డిమాండ్ చేశారు.కానీ అమిత్ షా నిరాకరించారు. దీంతో అభిషేక్ బెనర్జీ కోల్ కతా కోర్టులో బీజేపీ చీఫ్ అమిత్ షా పై పరువునష్టం దావా దాఖలు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here