చెన్నై పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ్టి చెన్నై పర్యటనను రద్దు చేసుకున్నారు. మామూలుగా ఈ రోజు చంద్రబాబు చెన్నై వెళ్ళవలసి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభ గురువారం చెన్నైలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాయుడు వెళ్లేవారు. కానీ ఆయన బావమరిది టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అకాల మరణంతో చెన్నై పర్యటన రద్దు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకి బదులుగా టీడీపీ ఎంపీలు అశోకగజపతిరాజు, సీఎం.రమేష్, సుజనా చౌదరి తదితరులు చెన్నై వెళ్లి కరుణానిధి సంతాప సభలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here