కేంద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిదంబరం

ఆంద్రప్రదేశ్ విభజన చట్టంపై అమలు తీరుపై పార్లమెంటరీ హోంశాఖ ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ తీరు సరిగాలేదన్నారు. చిదంబరం నేతృత్వంలో గురువారం పార్లమెంటరీ హోంశాఖ ప్లానింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 108లో మూడేళ్లలో సమస్యలు పరిష్కరించాలని ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని, అధికారులను చిదంబరం ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ లలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు పైనా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలులో చిత్తశుద్ధి కరువైందని చిదంబరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ప్రశ్నలకు స్పందించిన అధికారులు.., రైల్వే జోన్, ఆర్థికలోటు భర్తీ, ప్రత్యేక హోదా అంశాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేడీ ఎంపీ పట్సానీ స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్ విభజన హామీల అమలు తీరుపై త్వరలో నివేదిక తయారు చేయాలని ప్లానింగ్ కమిటీ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here