మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 246 ఆలౌట్.. ఇండియా 19/0

ఇండియా-ఇంగ్లండ్ మధ్య సౌతాంఫ్టన్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో, ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒకదశలో 86 పరుగలకే 6 వికెట్లు కోల్పోయి, కనీసం 150 పరుగులైనా చేస్తుందో లేదో అన్న పొజిషన్ నుండి తేరుకుంది. సామ్ కుర్రన్, మోయిన్ అలీ జోడి 7వ వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే సామ్ కుర్రన్, స్టువర్ట్ బోర్డ్ తో కలసి 9వ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో వెన్నెముకగా నిలిచిన సామ్ కుర్రన్(78) ను 77వ ఓవర్లలో అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 76.4 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్టు తీశారు. అనంతరం ఇండియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. 4 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేశారు.
శిఖర్ ధావన్ 3*
కెఎల్ రాహుల్11*
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్
అలిస్టర్ కుక్ 17
కీటోన్ జెన్నింగ్స్ 0
జో రూట్ 4
జానీ బెయిర్ స్టో 6
బెన్ స్ట్రోక్స్ 23
జొస్ బట్లర్ 21
మోయిన్ అలీ 40
సామ్ కర్రన్. 78
అదిల్ రషీద్ 6
స్టువర్ట్ బోర్డ్ 17
జేమ్స్ ఆండర్సన్ 0*
ఇండియా బౌలింగ్
జస్ప్రీత్ బుమ్రా 20-5-46-3
ఇషాంత్ శర్మ 16-6-26-2
హార్దిక్ పాండ్యా 8-0-51-1
మొహ్మద్ షమీ18-2-51-2
రవిచంద్రన్అశ్విన్ 14.4-3-40-2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here