అంతిమ వీడ్కోలు: తలకొరివి పెట్టనున్న కళ్యాణ్ రామ్… అన్నకు అండగా ఎన్టీఆర్

బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర హరికృష్ణ నివాసం నుంచి ప్రారంభమై జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. ఈ అంతిమ యాత్ర వాహనం లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు, చంద్రబాబు, జాస్తి చలమేశ్వర్, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రయాణించారు. చంద్రబాబు ఈ వాహనంలో ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మహా ప్రస్థానం వద్దకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, విఐపీలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. భారీగా జనం తరలి వచ్చారు. వైవీస్ చౌదరి, అలీ ఇతర సినీ ప్రముఖులు మహాప్రస్థానం వద్ద అంత్యక్రియ ఏర్పాట్లను పరిశీలించారు.
హరికృష్ణ చితికి పెద్ద కుమారుడు కల్యాణం రాం నిప్పుపెట్టనున్నారు. అంతిమయాత్ర వాహనం ముందు కల్యాణ్ రాం తండ్రికి పెట్టే తల కొరివితో భారమైన హృదయంతో కదలగా అన్నకు అండగా అన్న వెంట ఎన్టీఆర్ నడిచాడు. మహాప్రస్థానంలో వాహనం నుంచి హరికృష్ణ భౌతికకాయాన్ని దించగా.. అక్కడ నుంచి చితి వరకు చంద్రబాబు తదితరులు పాడెను మోశారు. తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా అంత్యక్రియలకు హాజరవుతున్నట్లు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here