హరికృష్ణకు వెంకయ్య నాయుడు నివాళి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఉదయం మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ హరికృష్ణ నిర్భీతిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వారని అన్నారు. హరికృష్ణ ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గతంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని గట్టిగా చెప్పారని .. ఆనాటి రాజ్యసభ చైర్మన్ అభ్యంతరం తెలిపితే, తాను జోక్యం చేసుకొని, నేను తర్జుమా చేస్తానని చెప్పినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉందని.., సినిమా, రాజకీయ రంగాలలో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here