హరికృష్ణ పార్ధీవ దేహానికి టిడిపి జెండా కప్పిన చంద్రబాబు

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన నందమూరి హరి కృష్ణ అంతిమ యాత్ర ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైంది. ఏపీ సిఎం చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లోకేష్ లు పాడే మోశారు. ఈ అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు నేతలు తరలి వచ్చారు. మెహదిపట్నం నుంచి మొదలైన ఈ అంతిమ యాత్ర.. జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వారకు సాగింది. దాదాపు గంటన్నర వరకు సాగిన ఈ యాత్రలో హరికృష్ణ బౌతిక కాయం వద్దనే చంద్రబాబు నిలుచుని ఉన్నారు. మరో వైపు దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిలబడి ఉన్నారు. తండ్రి భౌతిక కాయం ఇరువైపులా ఎన్టీఆర్, కళ్యాణ్ రాం లు బాలకృష్ణ ఉండగా.. లోకేష్ టిడిపి నేతలతో కలిసి ముందు నడిచారు.. అయితే హరికృష్ణ పార్ధీవ దేహానికి చంద్రబాబు టిడిపి జెండా కప్పారు. మరికొంచెం సేపట్లో అధికార లంఛనాలతో అంతిమ స్మస్కారాలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here