కొడుకుగా, తండ్రిగా ఆయన పరిపూర్ణ వ్యక్తీ.. మేము ఆయన కడుపున పుట్టడం అదృష్టం

ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరివద్ద పెరిగిన హరికృష్ణ కు ఆయన తో ఎంతో అనుబంధం ఉంది.. తండ్రి పెద్ద స్టార్ హీరో అయినా హరికృష్ణ బాల్యం నిమ్మకురులో తాతగారి ఇంటి వద్దనే జరిగింది. ఇక తండ్రిపై హరికృష్ణ ఎంతో ప్రేమాభిమానాలను కలిగిఉండేవారని… ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటారు. ఒక కొడుకుగా తండ్రిపై ఎంతటి ప్రేమను కనబరిచేవారో… అదే స్థాయిలో ఒక తండ్రిగా తన వారసులపై కూడా ప్రేమను కనబరిచేవారు. ఆయన వారసులైన జానకి రామ్, కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లను హరికృష్ణ ఎంతగానో ప్రేమించే వారు… వారు కూడా తమ తండ్రిపై అంటే గౌరవం కలిగి ఉండేవారు… ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా వేడుకలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… “మా నాన్నాగారు తాతగారి కోససం లక్షల కిలోమీటర్లు చైతన్య రథం నడిపారు. అటువంటి తండ్రి కడుపున పుట్టిన మేము చాలా అదృష్టవంతులం ” అని తండ్రి హరికృష్ణ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఇక అదే వేడుకలో ఎన్టీఆర్ తన తండ్రి గురించి మాట్లాడుతూ… ” నాన్న ఎప్పుడు మా ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే చెప్పేవారు.. కింద పడండి ఫర్వాలేదు… కానీ మిమ్మల్ని మీరు నమ్ముకుని పైకి రండి” అంతేకాని పిరికి పందల్లా బతకడం మాత్రం బతకకండి .. అని చెప్పేవారు. అన్నారు.. తండ్రితో ఎంతో అనుబంధం ఉన్న ఆ అన్నదమ్ములు తండ్రి భౌతిక కాయం వద్ద పెడుతున్న కన్నీరు చూపరులను కూడా కంటతడిపెట్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here