హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులు

తాత లక్ష్మయ్య, కొడుకు జానకిరాం మాదిరిగానే రోడ్డు ప్రమాదంలో ఎవరూ ఉహించని రీతిలో హరికృష్ణ మృతి చెందారు.. ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న హరికృష్ణ కు సంబంధించిన పలు ఆసక్తి కరమైన అంశాలను ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రికి పదవిని కట్టబెట్టిన రథసారథి…వ్యక్తీ గత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించిన ఇష్టాలు, అలవాట్లు రోజువారీ దినచర్య ఇలా అనేక విషయాలు బయటకి వచ్చాయి. ఆయన ఒత్తిడి లో ఉన్న సమయంలో ఏమి చేసేవారు.. ఎక్కడికి వెళ్లారు వంటి వివరాలను చూస్తే..
*హ‌రికృష్ణ‌కు అబిడ్స్ లో ఆహ్వానం హెట‌ల్ ఉన్న‌ద‌న్న‌ సంగతి తెలిసిందే. ఆ హోట‌ల్లోని 1001 రూమ్ ఎవ‌రికి ఇచ్చేవారు కాదు. ఎందుకంటే.. హ‌రికృష్ణ అందులోనే ఉంటారు. కీల‌క నిర్ణ‌యాల‌న్ని అందులోనే తీసుకునే వారు. ఆయ‌న దిన‌చ‌ర్య సైతం అక్క‌డి నుంచే ప్రారంభ‌మ‌య్యేది. ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ హోట‌ల్లోని ఈ గ‌దికి చేరుకొని ముందుగా గ‌ది ఎదురుగా ఉండే వినాయ‌కుడి విగ్ర‌హానికి పూజ‌లు చేసి లోప‌ల‌కు వెళ్లేవారు. అనంత‌రం దిన‌ప‌త్రిక‌ల్ని కాసేపు చ‌దివి.. సేద తీరేవారు.

*ఆయ‌న రోజువారీ జీవితం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కే మొద‌ల‌య్యేది. అప్ప‌టి నుంచి క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఆయ‌న దిన‌చ‌ర్య ఉండేది.

* రమణయ్య అనే వ్యక్తి… హ‌రికృష్ణ‌కు17ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్నారు. హ‌రికృష్ణ తాగే కాఫీలో ఎంత చ‌క్కెర ఉండాలి? ఉద‌యం టిఫెన్ ఏం తింటారు? మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఏం ఉండాలి? ఏ టైంకి ఏ ఏ మందులు ఇవ్వాలో అవ‌న్నీ అత‌డే చూసుకునేవాడు. హోట‌ల్లోకి రాగానే కారులో ఉండే వాట‌ర్ బాటిల్స్ తీసుకెళ్ల‌టం. ఉద‌యం కామ‌త్ హోట‌ల్లో టీ తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అది తాగిన త‌ర్వాతే అల్పాహారం.

*టిఫిన్ కోసం టీ టైమ్ హోట‌ల్ నుంచి ఇడ్లీ తెప్పించుకుంటారు. ఉద‌యం 10 నుంచి 12 మ‌ధ్య‌లో కొద్దిమందితో స‌మావేశ‌మ‌య్యాక‌.. భోజ‌నం చేసేవారు. బీపీ.. షుగ‌ర్ కు సంబంధించిన మందులు వేసుకోవ‌టం.. కాసేపు టీవీ చూడ‌టం చేసేవారు.

*రాత్రి ఇంటికి వెళ్లే ముందు అర‌లీట‌రు జెర్సీ పాలు తాగ‌టం హ‌రికృష్ణ‌కు అల‌వాటు. ఒక‌వేళ ఒత్తిడిలో ఉంటే అబిడ్స్ లోని కేఎఫ్ సీ నుంచి చికెన్ లాలీపాప్ లు.. పాపాజి దాబా నుంచి తందూరీ చికెన్ తెప్పించుకునేవారు.

*ప్ర‌తి సోమ‌వారం సాయంత్రం నిమ్మ‌కాయ‌లు.. నాలుగు కొబ్బ‌రికాయ‌లు.. పూజాసామాగ్రి తెప్పించి ఇంటికి తీసుకెళ్లేవారు. ఇంటికి వెళ్లే ప్ర‌తిరోజూ.. ర‌మ‌ణ‌య్యా.. నేను వెళుతున్నా.. జాగ్ర‌త్త అని అప్యాయంగా చెప్పి వెళ్ల‌టం హరికృష్ణ అల‌వాటు.

*హ‌రికృష్ణ‌కు జంతువులంటే ప్రాణం. ఆయ‌న ఆహ్వానం హోట‌ల్ పార్కింగ్ స్థ‌లంలో ప్ర‌త్యేకంగా జంతువులు పెంచేందుకు షెడ్డు ఏర్పాటు చేశారు. అందులో ఆవు.. రామ‌చిలుక‌.. పావురాళ్లు.. కోళ్లు.. కుందేళ్లు పెంచేవారు. వాటికి ఆహారం.. నీళ్ల‌ను ప్ర‌తిరోజూ ఏర్పాటు చేసేవారు.

*ఆవుకు పూజ‌లు చేయ‌టం..హరికృష్ణకు అత్యంత ఇష్టమైన పని.. సమయం ఉంటేచాలు వ‌న‌స్థ‌లిపురంలో ఉన్న గోశాల‌కు వెళ్లి గోవుల‌కు పూజ‌లు చేసేవారు. నాలుగేళ్ల క్రితం కొడుకు మ‌ర‌ణం త‌ర్వాత ఆవేద‌న‌తో ఉన్న హ‌రికృష్ణ మూడు నెల‌లు హోట‌ల్ వైపు చూడలేదు.. ఆ సమయంలో ఆ ముగాజీవాల అల‌నాపాల‌నా చూసేందుకు ఇబ్బందిగా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకొని.. ఆవును గోశాల‌కు.. మిగిలిన ప‌క్షుల‌ను జూపార్కుకు పంపించేశారు.
* సీత‌య్య సినిమాలో హ‌రికృష్ణ వాడిన రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ ను అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు దానిపై అబిడ్స్ లో చెక్క‌ర్లు కొట్టేవారు. పాన్ షాప్ కు వెళ్లి పాన్.. మిగిలిన వ‌స్తువులు స్వ‌యంగా కొనేవారు. ఎన్ ఫీల్డ్ మీద హ‌రికృష్ణ వెళుతుంటే.. సినిమాలో సీత‌య్య‌ను చూసిన‌ట్లే ఉండేది. ఇప్పుడా రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ ఆహ్వానం హోట‌ల్ వ‌ద్దే ఉంది.

*హైద‌రాబాద్ లో ఎన్ని మ‌ల్టీఫ్లెక్సులు.. థియేట‌ర్లు ఉన్నా.. అబిడ్స్ లోని తమ రామ‌కృష్ణ థియేట‌ర్లోనే ఎక్కువ‌గా సినిమాలు చూడ‌టం హ‌రికృష్ణ‌కు ఇష్టం. జూనియ‌ర్ ఎన్టీఆర్.. క‌ళ్యాణ్ రామ్ సినిమాల్ని ఆయ‌న రామ‌కృష్ణ థియేట‌ర్లోనే చూసేవారు. త‌న తండ్రి సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు నుంచి ఇప్పుడు మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here