మహాప్రస్థానంలో ముగిసిన రథ సారథి అంత్యక్రియలు

నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో అధికార లాంఛనాల మధ్య ముగిశాయి. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ కన్నీరుతో తండ్రి చితికి నిప్పు పెట్టారు. హరన్న చివరి చూపుకోసం కుటుంబ సభ్యులు, అభిమానులు, సిని, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ గౌరవార్ధం పోలీసులు గాలిలో మూడు సార్లు కాల్పులు జరిపారు.. రథ సారధికి కుటుంబ సభ్యులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here