పల్లె రఘునాథరెడ్డి భార్య పల్లె ఉమాదేవి మృతి

పుట్టపర్తి ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి భార్య, బాలాజీ విద్యాసంస్థల కరస్పాండెంట్ పల్లె ఉమాదేవి (56) అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ గురువారం మృతి చెందారు. పల్లె ఉమాదేవి, తన భర్త పల్లె రఘునాథరెడ్డి విజయానికి 1999,2004,2009,2014 ఎన్నికల్లో విశేషంగా కృషి చేసారు. తమ విద్యా సంస్థల తరుపున వేలాదిమంది విద్యార్థులకు విద్యను అందించి, ఎంతోమందికి ఉద్యోగావకాశాలు చూపి తమ కళాశాలలో ఉపాధి కల్పించారు.పల్లె ఉమాదేవి మృతితో పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, విద్యా సంస్థల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులలో విషాదఛాయలు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here