టిఆర్ఎస్ ని తీవ్రంగా విమర్శించిన రేవంత్

టిఆర్ఎస్ ని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం మాల్ లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రగతి నివేదన’ సభకు 200 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.., ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన కెసిఆర్…మరియు ఆయన ఫ్యామిలీ వేల కోట్లు వెనకేసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ చీడ’ ను వదిలించాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here