కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం

తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీసు నిబంధనలు మార్చుకుని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, అన్ని శాఖల కార్యదర్సులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్తగా దాదాపు యాభై వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలలను కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వాస్తవరూపంలోకి తెచ్చి చూపిస్తుంది. ఇప్పటికే నిధుల సమస్యను పరిష్కరించగా, నీళ్లకోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.ఇక నియామకాల్లో భాగంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించే దిశగా నూతన జోనల్ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here