వెస్టిండీస్ జట్టు భారత పర్యటన షెడ్యూల్ ఖరారు

వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ పర్యటన ఖరారైంది. ఈ వివరాలను వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. కాగా 15 మందితో కూడిన వెస్టిండీస్ జట్టు సభ్యులను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 18 మధ్య వెస్టిండీస్ జట్టు ఇండియా లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. తొలి టెస్ట్4th-8th మ్యాచ్ కు రాజ్ కోట్, రెండో టెస్టు 12th-16th మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనున్నాయి. వన్డే టోర్నీ 21 అక్టోబర్ నుంచి మొదలవుతుంది. మొదటి వన్డే 21న గౌహతిలో, రెండో వన్డే 24న ఇండోర్ లో, మూడో వన్డే 27న పూణే లో, నాల్గవ వన్డే 29న ముంబాయిలో, ఐదవ వన్డే నవంబర్ 1న తిరువనంతపురం లో జరుగుతాయి. ఇక టి20 టోర్నీ 4న మొదలవుతుంది. మొదటి టి20 4న కోల్ కతా లో, రెండో తో20 6న కాన్పూర్లో, మూడో టి20 11న చెన్నైలో జరగనున్నాయి.
టెస్టు జట్టు: జాసన్ హోల్డర్(కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్ వైట్, రోస్టన్ ఛేజ్, షేన్ డోరిచ్, షన్నాన్ గాబ్రియల్, జహ్మిర్ హామిల్టన్, షిమ్రాన్ హెట్మేర్, షాయ్ హోప్, అల్జరీ జోసెఫ్, కీమోపాల్, కీరన్ పావెల్, కెమెర్ రోచ్, జోమెల్ వరికన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here