‘ధర్మరాజు’ చివరి ప్రయాణంలో చివరివరకూ కుక్కమాత్రమే… మనిషికి ఏమి చెబుతుందో తెలుసా..!!

శ్రీకృష్ణుని మరణానంతరం ధర్మరాజు విరక్తితో వేరొకరికి రాజ్య భాద్యతలు అప్పజెప్పి స్వర్గప్రాప్తికై వెళ్తు ఉంటాడు..అతనితో పాటు సోదరులు, ద్రౌపది కూడా అనుసరిస్తారు. అందరూ దాదాపు స్వర్గ ద్వారాలు వరకూ సమీపిస్తారు..అక్కడకు రాగానే ద్రౌపది కిందకు పడిపోతుంటే, భీముడు ఆందోళనతో ధర్మరాజు ద్రౌపది కిందకు పడిపోయిన విషయం చెబుతాడు.. ధర్మరాజు వెనుకకు చూడకుండానే “పడిపోనీ, పాంచాలి పక్షపాతంతో ప్రవర్తించింది. మన నల్గురికంటే అర్జునుని మీద మక్కువ ఎక్కువ చూపించింది. అంటూ ధర్మరాజు తనకు ద్రౌపది తో సంబంధం లేనట్టు ముందుకు సాగుతాడు..మరికొంచెం దూరం వెళ్ళగానే సహదేవుడు పడిపోతాడు. అది చుసిన భీముడు మళ్ళీ ధర్మరాజుకు చెప్పాడు..”సహదేవునుకి పాండిత్యం తనకు మాత్రమే ఉన్నదనే గర్వం” వెనక్కి తిరిగి చూడకుండా ధర్మరాజు మిగిలిన వారితో ముందుకు సాగాడు..తర్వాత నకులుని పతనం చెప్పగా “భీమా! అతనికి తనకంటే అందమైన వారు ఎవరూ లేరనే అహంకారం, అందుకే పడిపోయాడు” అని వెనుదిరిగి చూడకుండా చెప్పాడు ధర్మరాజు..ఇక అర్జునుడు పతనం చూసి భయంతో భీముడు అన్నా! మన ప్రియ సోదరుడు పార్ధుడు కూడా పడిపోతున్నాడు అని చెప్పగా ” పడనీ, నేనే గొప్ప విలుకాడినని, విజయుడు ఎప్పుడూ విర్రవీగేవాడు” అంటూ ధర్మరాజు ముందుకు సాగాడు.. చివరికి “అన్నా! నేను కూడా పడిపోతున్నా కాపాడమని” భీముడు అడుగగా “భీమా! నువ్వొక పెద్ద తిండిపోతువు..ఈ లోకంలో నీకంటే బలవంతుడు లేడని నీకు అహంకారం..దూరభిమానానికి పతనం తప్పదు” అంటూ ఆగకుండా ముందుకు సాగిపోయాడు

స్వర్గారోహన శిఖరానికి చేరుకుంటున్న ధర్మరాజు, తాను ఒంటరి కానని, ఆది నుంచి తనను అనుసరించి వస్తున్న ఒక కుక్క తనవెంట ఉన్నదని గుర్తిస్తాడు.. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై ప్రాణంతోనే ఉన్న ధర్మరాజుని స్వర్గానికి ఆహ్వానిస్తు రథాన్ని అధిరోహించమని కోరతాడు..”దేవేంద్రా! మొదట నన్నాశ్రయించి వచ్చిన ఈ కుక్కను రథమెక్కనివ్వండి, తర్వాత నేనూ ఎక్కుతాను” అనగా అప్పుడు ఇంద్రుడు”ధర్మరాజా! శునకానికి స్వర్గలోకంలో స్థానం లేదు, కుక్కను పెంచే వారికి కూడా స్వర్గలోక ప్రవేశం ఉండదు” అంటాడు..అయితే స్వర్గంతో నాకూ పనిలేదని ధర్మరాజు అంటాడు..”ఇంద్రా! నా వారంతా నన్ను వదలి వెళ్లిపోయినా వదలకుండా నావెంట వచ్చింది ఈ శునకం..దీన్ని నేను పెంచలేదు..అదే నన్ను ఆశ్రయించింది..దాన్ని వదిలిపెట్టడం అధర్మం..నా పుణ్యంలో సగభాగం ఈ కుక్కకు ధారపోస్తున్నా..ఇదికూడా నాతోడుగా వస్తుంది” అంటాడు ధర్మరాజు..వెంటనే శునక రూపంలో ఉన్న ధర్మదేవత ప్రత్యక్షమై “ధర్మ పరీక్షలో నీవు నేగ్గావు, సశరీర స్వర్గ ప్రాప్తిరస్తూ అని ఆశీర్వదిస్తోంది.

కాబట్టి, మృతదేహాన్ని బంధుమిత్రువులంతా ఏదో కొయ్యముక్కో, మట్టి గడ్డ అనో పారేసినట్లుగా నేల మీద పడేసి వెళ్ళిపోతారు..ఆ వ్యక్తి చేసిన పాప పుణ్యాలు అనే ధర్మమొక్కటే వెంట వెడుతుంది..ధనాన్ని బీరువాలో, బ్యాంకులోనూ, భార్యను ఇంటి గుమ్మలోనూ, బంధుమిత్రులను స్మశానంలోనూ, దేహాన్ని చితి మీద విడిచిపెట్టినప్పుడు మనం చేసిన ధర్మం ఒక్కటే మన వెంట వస్తుంది అని అందరం గ్రహించాలని ఈ కథను పెద్దలు చెబుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here