బ్యాంకుల వరస సెలవులు… వినియోగదారులకు షాక్

బ్యాంక్ వినియోగదారులకు షాక్ కలిగించే న్యూస్.. సెప్టెంబర్ నెల మొదటి ఐదు రోజులు వరసగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, వరస సెలవులతో 1 నుంచి 5 వరకూ బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 1 శనివారం పనిదినమైనా చాలా చోట్ల ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఇక 2వ తేది ఆదివారం, 3 వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు.. ఇక 4,5, తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here