టాలీవుడ్ లో మరో విషాదం… ప్రముఖ దర్శకురాలు బి.జయ మృతి

టాలీవుడ్ లో వరస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు హరికృష్ణ మృతి నుంచి ఇంకా తేరుకోకముందే… మహిళా దర్శకురాలు బి.జయ(52) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ రాత్రి కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయ సినీ జర్నలిస్టుగా తన జర్నీ మొదలు పెట్టి.. అనంతరం సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ, వైశాఖం వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. వైశాఖం సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు జయ.. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. తాజాగా మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. జయ భర్త బి.రాజు సిని రంగానికి చెందిన వ్యక్తీ.. జయ మరణవార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. సూపర్‌ హిట్‌ పేరిట సొంతగా సినిమా పత్రికను కూడా జయ నడిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here