భోజనం చేసిన తర్వాత బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా చెరకు రసము నుంచి కొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లం తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రాకలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. పూర్వకాలంలో ఎక్కువుగా బెల్లంనే ఉపయోగించే వారు.అసలు పాలల్లోనే కాదు.. స్వీట్స్ తయారీకి కూడా బెల్లంను ఎక్కువగా ఉపయోగించేవారు.. ఇప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడ పెద్దవారు భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్కను నోట్లో వేసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది. . కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులతో బెల్లం ప్లేస్ ను పంచదార ఆక్రమించింది. కానీ బెల్లం ను ప్రతి రోజూ తింటే చాలా ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ విషయం ను శాస్త్రజ్ఞులు సైంటిఫిక్ గా నిరూపించారు.
బెల్లం సహజ శక్తిని ఇవ్వడంలో ముందుంటుంది.
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .
బెల్లం తినడం వల్ల శ్వాస నాళాలను, ఊపిరితిత్తులను, ఆహారనాళాలను శుద్ధిపరుస్తుంది. రక్త వృద్ధికి సహాయపడుతుంది.
జీర్ణ శక్తిని పెంచుతుంది. అజీర్తి సమస్య నివారిస్తుంది.
వేసవిలో బెల్లం నీరు తాగితే శరీరంలో ఉండే వేడి అదుపులో ఉంటుంది.
రక్త ప్రసరణకు పడుతుంది.
దగ్గు, జలుబు వంటి అంటు వ్యాధులను బెల్లం దరిచేరకుండా చేస్తుంది.
బెల్లం పాజిటివ్ ఎనర్జీని పెంచడమే కాదు.. మనశ్శాంతి ని కూడా ఇస్తుంది.
గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన … నెలసరి సమస్యలు ఉండవు.
నేయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .
బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .
భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని ‘మెడిసినల్‌ సుగర్‌’గా వ్యవహరిస్తారు. బెల్లంలో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. చిటికెడు బెల్లాన్ని అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here