లంచ్ విరామానికి ఇండియా 100/2…

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు లంచ్ విరామానికి ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 31 ఓవర్లలో 100 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా(28), కోహ్లీ(25) ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్టుకు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్(19), శిఖర్ ధావన్ (23) ఔట్ అయ్యారు. ఈ రెండు వికెట్లు స్టువర్ట్ బ్రాడ్ తీసాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సాధించాడు.టెస్ట్ కెరీర్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 119 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. 120 ఇన్నింగ్స్ లలో ఆ ఘనత సాధించిన సచిన్ ను వెనక్కి నెట్టాడు. మొదటి స్థానంలో సునీల్ గవాస్కర్ 117 ఇన్నింగ్స్ లు, రెండవ స్థానంలో కోహ్లీ 119 ఇన్నింగ్స్ లు, మూడు సచిన్ 120 ఇన్నింగ్స్ లు, నాలుగు సెహ్వాగ్ 121 ఇన్నింగ్స్ లు, ఐదు ద్రావిడ్ 125 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here