ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు షాక్ ఇస్తూ.. ఇంధన ధరలకు మరో సారి రెక్కలొచ్చాయి. రూపాయి పతనం కావడంతో ముడిచమురు ధరలు పెరిగి.. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. గురువారం జీవనకాల గరిష్ఠానికి చేరిన డీజిల్‌.. నేడు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అటు పెట్రోల్‌ కూడా నేడు జీవనకాల గరిష్ఠాన్నికి చేరుకుంది. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 78.43గా ఉండగా ఇప్పుడు 22 పైసలు పెరిగి రూ. 78.52లకు చేరుకుంది. డీజిల్ ధర రూ. 70.21లు అయ్యింది. దీంతో జీవన కాల గరిష్టానికి చేరుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here