ముఖంపై నల్లమచ్చలను సింపుల్ గా తగ్గించుకోవడం ఎలా…?

అందానికి ప్రతిరూపం మహిళలు. అందం ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది. అందుకే మహిళలు అందంగా కనిపించడం కోసం వేలకువేలు ఖర్చుపెడుతుంటారు. కొందరికి ఎంత ఖర్చు పెట్టినా ముఖం పై నల్ల మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి వాటిని మటు మాయం చేయడం ఎలా..? ఇంట్లో ఇది సాధ్య పడుతుందా అంటే …కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యపడుతుందనే చెప్పాలి. మరి అది ఎలాగో ఇప్పడు తెలుసుకుందాం…
జాజికాయ: ఈ పేరు రాను రాను మర్చిపోయే అవకాశం ఉంది. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జాజికాయను అరగదీసి గంధం లాగా ప్రతి రోజూ ముఖానికి అప్లై చేసి …ఎండిన తరువాత కడుక్కొంటే నల్లటి మచ్చలు తొలిగిపోయే అవకాశం ఉంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే మేలిమిఛాయ మీ సొంతం.

పసుపు: ఈ కొమ్మలను జిల్లేడు పాలతో నూరి ముఖం మీద రాసుకుంటే చాలా కాలంగా ఉన్న నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి. పసుపు పొడిని..ఎర్రచందనంతో కలిపి, గేదె పాలలో మర్థించి లేపనంగా వేస్తే నల్ల మచ్చలు లేకుండా చేస్తుంది. పండిన మర్రి ఆకులు, జాజి ఆకులు, ఎర్రచందనం, చెంగల్వ కోష్టులను కలిపి నూరి లేపనంగా వేస్తే నల్ల మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు కూడా మాయమవుతాయి.

పాల్లలో కాస్త, పసుపు నిమ్మరసం కలిపి పేస్టు లాగా చేసుకొని ముఖం పై రాసుకుంటే నల్లమచ్చలు తొలిగిపోయే అవకాశం ఉంది. బంగాళ దుంప కూడా రౌండ్‌గా కట్ చేసి మచ్చలు ఉన్న చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల గలిజేరు: ఈ వేరును మెత్తగా నూరి, ఆ నలుగును ముఖానికి పెడితే ముఖం మీది నల్లదనం పోయి ముఖం కాంతిమంతమవుతుంది. తులసి: ఈ ఆకు రసంలో వెల్లుల్లి కలిపి దూదితో మచ్చలున్న చోట అప్లై చేస్తే నల్ల మచ్చలు కనుమరుగవుతాయి.

నువ్వులు, తెల్ల జీలకర్ర, నల్లజీలకర్రలను పాలలో నూరి ఏడు రోజులు రాస్తే ముఖం మీది నల్ల మచ్చలు హరిస్తాయి. మర్రి చిగుళ్లు, చిరు శెనగలను కలిపి నూరి లేపనంగా వేసినా నల్ల మచ్చలు తగ్గిపోతాయి. అందమైన ముఖారవిందం మీ సొంతం.

గేదె పాలతో తీసిన వెన్నతో మసాజ్ చేస్తే కూడా మచ్చలు పోతాయి. వీటన్నింటికి తోడు తగినంత నిద్ర, నీరు కూడా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here