సైరాలో టబు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా… తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకేక్కుతున్నది. బిగ్ బి అమితాబ్, నయన తార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా వంటి భారీ తారాగణంతో తెరకేక్కుతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ నటి టబు నటించనున్నట్లు టాక్. త్వరలో చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నదట. చిరంజీవి తో అందరివాడు లో జతకట్టిన టబు… మళ్ళీ చాలా కాలం తర్వాత సైరా లో జతకత్తనున్నది ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించుకోవడానికి జార్జియా పయణం కానున్నట్లు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here