కేరళకు 80లనాటి తారల 40 లక్షల విరాళం

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల ఎందరో నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు 1980 కాలం నాటి దక్షిణ సినీ పరిశ్రమకు చెందిన తారాలంతా 80 రీయూనియన్ పేరుతో విరాళాలు సేకరించి వచ్చిన మొత్తం 40 లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు అందించారు. ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.కేరళ సీఎం విజయన్ ను కలిసిన సందర్భంలో హీరోయిన్లు కుష్భు, లిజి కూడా ఉన్నారు. 80’s సౌత్ యాక్టర్స్ రీయూనియన్ ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here