సింపుల్ గా కలర్స్ స్వాతి వివాహం

హీరోయిన్ కలర్స్ స్వాతి వివాహం సింపుల్ గా జరిగింది. ప్రేమ, పెళ్లి వార్తలపై గుంభనంగా ఉన్న స్వాతి, వివాహ వేడుకను కూడా సీక్రెట్ గానే ఉంచింది. కేరళకు చెందిన పైలట్ వికాస్ తో కలర్స్ స్వాతి వివాహం గురువారం రాత్రి సింపుల్ గా జరిగింది. కేవలం స్వాతి కుటుంబీకులు, వికాస్ కుటుంబీకులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం సెప్టెంబర్ 2న కొచ్చిలో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కి తెలుగు, తమిళ, మలయాళ నటీనటులకు కలర్స్ స్వాతి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
కలర్స్ స్వాతి బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రాం చేసి భారీ క్రేజ్ సంపాదించుకుని, కలర్స్ అనేది ఇంటిపేరుగా మార్చుకుంది.ఆ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన స్వాతి డేంజర్, అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ, కలవరమాయే మదిలో తదితర సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్వాతి తెలుగే కాకుండా తమిళ, మలయాళీ సినిమాలలో కూడా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here