పారదర్శకత, జవాబుదారీతనంలో ఏపీకి మొదటి స్థానం

జాతీయ అవార్డులకు విశాఖ, ప్రకాశం జిల్లాలు ఎంపికయ్యాయి. ఉపధిపనులపై కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించింది.2016-2017, 2017-2018 ఆర్థిక సంవత్సరాలకు గానూ కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. 9 విభాగాల్లో 10 అవార్డులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. పారదర్శకత, జవాబుదారీతనంలో ఆంధ్రప్రదేశ్ కి మొదటి స్థానం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం, గుడ్ గవర్నెన్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ కి నాలుగో స్థానం దక్కింది. ఎక్కువ పనులు చేయడంలో మూడో స్థానం ఏపీకి లభించింది. ఉత్తమ గ్రామంగా చిత్తూరు జిల్లాలోని కోటబైలు గ్రామం ఎంపికైంది. ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబుకు అవార్డు దక్కింది. 7 అవార్డుతో వెస్ట్ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 11న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో అవార్డులు ప్రధానం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here