ఇబ్బందుల్లో టీమిండియా.. 46/3 తో లంచ్ కి

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాల్గవ రోజు లంచ్ విరామ సమయానికి 46 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మొదట్లోనే కెఎల్ రాహుల్(0) వికెట్టు కోల్పోయింది. బ్రాడ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన పుజారా ఆడుకుంటాడంటే, మొదటి ఇన్నింగ్స్ లో చక్కటి సెంచరీ చేసిన పుజారా కూడా (5) ఆండ్రూసన్ బౌలింగ్లో ఎల్బీడబ్య్లు గా వెనుదిరిగాడు. కాసేపటికె ధావన్ కూడా ఆండ్రూసన్ బౌలింగ్లో స్ట్రోక్స్ కి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్టుగా వెనుదిరిగాడు. క్రీజులో ఉన్న కోహ్లీ-రహానే జోడీ నిదానంగా ఆడుతూ వికెట్టు ను కాపాడుకుంటూ ఆడుతున్నారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండటంతో ఇండియా విజయ భారమంతా కెప్టెన్- వైస్ కెప్టెన్ ఆట మీదే ఆధారపడి ఉంది. వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పితేనే ఇండియా విజయం మీద ఆశలు ఉంటాయి. వీరి ఆటపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here